రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా పీస్ కమిటీ సమావేశం

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా పీస్ కమిటీ సమావేశం
గజ్వేల్, 01 మార్చి 2025  : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని  ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గజ్వేల్ సిఐ సైదా ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మురళి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, గజ్వేల్ ఎలక్ట్రిసిటీ  ఏఈ మారుతి, హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ సిఐ సైదా, ట్రాఫిక్ సీఐ మురళి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ ఆదివారం నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి పీస్ కమిటీ సమావేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించడం జరిగిందని, రంజాన్ మాసంలో రోడ్డుపై ఎక్కువగా పండ్లు, ఇతర వస్తువులు అమ్మడం జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలని,అలాగే రాత్రివేళలో పిల్లలు వెహికల్ రాష్ డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు. సానిటరీ మున్సిపల్ సంబంధిత పనులు, ఎలక్ట్రిసిటీ గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వారు సూచించారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్లపై హరీస్ సెంటర్ లను పెట్టకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు. అన్ని డిపార్ట్మెంట్ వారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటారని వారు  తెలిపారు.

Join WhatsApp

Join Now