Site icon PRASHNA AYUDHAM

కేరూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పెద్దపట్ల సాయి కార్తీక్ గౌడ్

IMG 20251201 175419

Oplus_16908288

సంగారెడ్డి/వట్‌పల్లి, డిసెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): వట్‌పల్లి మండలం కేరూర్ గ్రామంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పెద్దపట్ల సాయి కార్తీక్ గౌడ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ప్రదర్శన నిర్వహించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని సాయి కార్తీక్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు వీరన్నతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Exit mobile version