ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గా పెద్ది శ్రీనివాస్ గుప్త
గజ్వేల్ నియోజకవర్గం, 06 ఫిబ్రవరి 2025 :
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గా పెద్ది శ్రీనివాస్ గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జగదేవపూర్ మండల, జగదేవపూర్ పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జగదేవపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా పెద్ది శ్రీనివాస్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పెద్ది శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు పట్టణ ప్రధాన కార్యదర్శిగా అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు, అలాగే ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని ఆర్యవైశ్యులు సంఘటితం ద్వారానే మన హక్కులను సాధించవచ్చు అని అన్నారు.