పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చెయ్యాలి

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చెయ్యాలి

కలెక్టరేట్ ఎదుట ధర్నా కలెక్టర్ కి వినతి పత్రం

సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా ఉమ్మడి కరీంనగర్ జిల్లాఅధ్యక్షుడు అంగిడి కుమార్

కరీంనగర్ సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కలెక్టర్ కు వినతి పత్రం పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అందజేశారు అనంతరం పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల వసూలు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలను నడిపిస్తున్న ,ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు లేక టీచర్ పోస్టుల ఖాళీల మూలాన విద్య వ్యవస్థ కుంటుపడుతున్నదని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. విద్య బాగు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి 7 శాతానికి మించి బడ్జెట్ కేటాయించకపోవడం మూలాన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పిందని వెంటనే విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకుండా కాలయాపన చేస్తూ 500 పైగా ఎంఈఓ,28 డిఇఓ పోస్టుల ఖాళీలల మూలాన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే విద్య అధికారులు లేకపోవడం వల్ల గురుకులాలలు, సంక్షేమ హాస్టల్లో నిత్యం విద్యార్థులు కల్తీ ఆహారంతో అస్వస్థకు గురవుతున్నారని వాపోయారు.అలాగే విద్య ప్రమాణాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు రాష్ట్రంలో 8000 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అరవింద్ , లోకేష్ , ప్రవీణ్ కుమార్, జన్ సైదా, శివతేజ, అన్వేష్, సురేష్, విగ్నేష్, శ్రీకాంత్ సాయిరాం, శేఖర్, వంశీకృష్ణ, చరణ్, నిఖిల్, వంశీ ,హకీం గిరిబాబు, సర్దార్ నాయన ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

.

Join WhatsApp

Join Now

Leave a Comment