పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి

పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి

– బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్

 పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలల సాయి చందులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని అన్నారు. సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా దాదాపు 7,500 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని, నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు సంజీవని వంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పతకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థుల హక్కు అయిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకపోవడం అనేది పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వేలమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ రాని కారణంగా యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు రియంబర్స్మెంటు బకాయిలు చెల్లిస్తే తప్ప మేము కళాశాలలో నడపలేని స్థితిలో ఉన్నామని ప్రైవేటు యాజమాన్యాలు మొర పెట్టుకుంటున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి నడిపిస్తున్న కళాశాలలు వందల సంఖ్యలో ఉన్నాయని, మధ్యలోనే కళాశాల యాజమాన్యాలు చేతులెత్తే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఇటు యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి మధ్యలో బలవుతున్నది విద్యార్థులేనని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సర్టిఫికెట్స్ రాక, ఒకవైపు ఉన్నత విద్యకు మరొకవైపు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా సర్టిఫికెట్స్ లేని కారణంగా విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టి వేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్న విద్య వ్యవస్థ తీరు మారడం లేదని, విద్యార్థుల జీవితాలు బాగుపడటం లేదన్నారు. ఉన్న విద్యాలయాలను విద్యావ్యవస్థను పటిష్ట పర్చాల్సిన ప్రభుత్వమే విద్యను అంధకారంలోకి నెట్టి వేస్తూ నూతనంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ యూనివర్సిటీలు అంటూ కొత్త హామీలతో చేతులు దులుపుకుంటుంది తప్ప ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న చిత్తశుద్ది ఏంటో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ లోనే అవగతం అవుతుందని అన్నారు. సంవత్సరాల తరబడి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్న, అనేక కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విద్యార్థుల యొక్క హక్కు అని జ్ఞప్తికి తెచ్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తుందని అన్నారు. లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు గోనెల రాజశేఖర్, నవీన్, ఉపాధ్యక్షులు కంటం శ్రీనివాస్, దమ్మ సంతోష్ రెడ్డి, రాగం శెట్టి సాయి కృష్ణ, ఎడమనపల్లి సాయి కుమార్, చింటూ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment