గ్రామ పంచాయతీ వర్కర్స్ కు ప్రభుత్వం ఇచ్చిన హామి మేరకు జీతాలు అకౌంట్ ద్వారా ఇవ్వాలి
– పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయలి
– గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, జిల్లా అద్యక్షులు బాలనర్సు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ తమ సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం సి ఐ టీ యు ఆధ్వర్యంలో జిల్లా పంచాయితీఅధికారి కి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మార్చి 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వాలని పిలుపు మేరకు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. మార్చి 06 వ తేదీన శాసన సభ్యులు కు వినతి పత్రాలు ఇవ్వాలని,
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలైన రాష్ట్రంలోని పెండింగ్ వేతనాల అమలు, చెక్కుల ద్వారా ఎస్టీఓలో ఆగిపోయిన వేతనాలు చెల్లించాలని, పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు జీవో నెంబర్ 51 సవరణ కారోబార్ లకు బిల్ కలెక్టర్ల ప్రత్యేక స్టేటస్ 15 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం, ఉద్యోగ భద్రత జీవో నెంబర్ 60ని అమలు చేయాలని కోరుతూ వివిధ జిల్లాలోని పంచాయతీ అధికారులకు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మన సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని ఎమ్మెల్యేలను కోరుతూ వినతి పత్రాలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపు ఉంటుందని పోరాటాలు జయప్రదం చేయడానికి కార్మిక వర్గమంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాల నర్స్ తో పాటు గ్రామపంచాయతీ కార్మికుల పాల్గొన్నారు.