*పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి.*
*ఎస్ఎఫ్ఐ మండల కమిటీ*
*జమ్మికుంట జులై 5 ప్రశ్న ఆయుధం*
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం రోజున ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లగా ఎవరు అందుబాటులో లేకపోవడం వలన నోటీసు బోర్డ్ వినతిపత్రాన్ని ఉంచి నిరసన తెలియజేశారు
అనంతరం ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షుడు సిద్ధిక్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడం వల్ల కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు రావలసిన సర్టిఫికెట్స్ ను ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాయని కళాశాలలు ఎలాంటి ఆంక్షలు లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహేష్ సందీప్ రక్షక్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు.