వృద్ధురాలికి పెన్షన్ తిప్పలు… కుర్చీతో నడక..!

వృద్ధురాలికి పెన్షన్ తిప్పలు… కుర్చీతో నడక..!

నడవలేని స్థితిలో కూడా పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధురాలు

కుర్చీకి ఆనుకుని దేహాన్ని లాగుకుంటూ వెళ్లిన దృశ్యం

మేళ్లచెరువు మండలంలో చోటు చేసుకున్న సంఘటన

చూస్తే ప్రతి వాళ్ళకి కు కన్నీళ్లు తడవాల్సిందే

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

మేళ్లచెరువు (సూర్యాపేట):

పెన్షన్ కోసం ఓ వృద్ధురాలు పడుతున్న వేదన ప్రతి మనిషి మనసును కదిలించాల్సిందే. మేళ్లచెరువు మండలంలోకి చెందిన వృద్ధురాలు నడవలేని స్థితిలో కూడా, కుర్చీకి సాయం తీసుకుని ఒంటరిగా పెన్షన్ కోసం బయటకు రావడం స్థానికులను కలచివేసింది. కుర్చీకి చేతులు ఆనుకొని, ఒక్కొక్క అడుగు వేయడం చూసిన వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పెన్షన్ డబ్బు రావాలంటే ఎంత అవమానం పడ్డా తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. వృద్ధురాలికి డోర్‌స్టెప్‌ పేమెంట్ చేయాల్సిన పరిస్థితిలో, ఆమెకు స్వయంగా రావాల్సిందిగా చెప్పిన వ్యవస్థపై నిలదీస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని, మానవతా దృక్పథంతో స్పందించాలంటూ స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment