పెన్షన్ విద్రోహ దినం

“ పెన్షన్ విద్రోహ దినం ”

యూనిఫైడ్ పెన్షన్ స్కీం మరో మోసం! టి ఎస్ యు టి ఎఫ్

సిద్దిపేట ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం :

ఉద్యోగులకు సి పి ఎస్ స్థానంలో ఏకీకృత పెన్షన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ విధానం ప్రస్తుత సిపిఎస్ విధానానికి మసిపూసి మారేడుకాయ చేయడమేనని, దానిని అంగీకరించేది లేదని టిఎస్ యుటిఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ స్పష్టం చేసింది. ఈసందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు 50% పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు, సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 60% ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ చందాతో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ప్రస్తావించకపోవటంతో పాటు సి పి ఎస్, యూపి ఎస్ లను ఐచ్ఛికం అని పేర్కొనటంలోనే అసలు మోసం ఉందని, ఇవేవీ కాకుండా ఒక్క రూపాయి చందా చెల్లించకుండానే సర్వీసును బట్టి 50% పెన్షను ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాల్సిందేనని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ వలి ఆహ్మద్, టి. యాదగిరి లు డిమాండ్ చేశారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి గారి నేతృత్వంలో ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపులు భారమవుంతుందనే భావనతో కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ ఎస్.ఎ.దవే చైర్మన్ గా కమిటీ వేసి సమర్పించిన నివేదిక ఆధారంగా సిపిఎస్ విధానాన్ని 2004 నుండి అమలులోకి తెచ్చారని, ఇందులో ఉద్యోగి వేతనం నుండి 10% మినహాయించి దానికి ప్రభుత్వం గ్రాంట్ జమచేసి పెన్షన్ ఫండ్ గా ఏర్పాటు చేసి వాటిని షేర్ మార్కెట్స్ కు మళ్ళించారని ఫలితంగా సిపిఎస్ ఉద్యోగి పదవీ విరమణ చేస్తే లేదా అర్థాంతరంగా మరణిస్తే వారి కుటుంబానికి 3000 నుండి 10000 రూపాయల లోపే పెన్షన్ వస్తుందని పేర్కొన్నారు. లక్షల మంది ఉద్యోగుల జీవితాలను చీకటిలో నెట్టిన సిపిఎస్ ను రద్దుచేయాలని గత 20 సంవత్సరాలుగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో మరియు ఎస్టీఎఫ్ఐ పక్షాన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు.

గత ఎన్నికల సమయంలో కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చాయని వాటిని అమలు చేయకుండా కేంద్రం మోకాలడ్డు వేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యుపిఎస్ అనే మరో కొత్త విధానానికి తెరతీసి ఉద్యోగుల సంక్షేమానికి గండి కొట్టిందని పెన్షన్ లో మార్పులు చేశామని ప్రకటించినప్పటికీ తిరిగి ఉద్యోగుల నుండి చందా వసూలు చేసే విధానాన్ని మాత్రం అట్లే కొనసాగిస్తూ ఉన్నారని ఇది కేవలం కార్పొరేట్ మార్కెట్ శక్తులకు ఆర్థిక లబ్ది చేకూర్చేందుకేనని వారు విమర్శించారు. సిపిఎస్ విధానం ప్రవేశపెట్టినపుడు కూడా సిపిఎస్ ఎంతో అద్భుతమైనదని ప్రచారం చేశారని కాని దాని అసలు స్వరూపం తెలిసాక దేశవ్యాప్త ఆందోళనలు ఉదృతం కావడంతో రాజకీయ లబ్దికోసం ఉద్యోగుల సంక్షేమాన్ని మరోసారి ఫణంగా పెడుతున్నారని ఇలాంటి విధానాలకు మూలమైన పిఎఫ్ఆర్డీయే చట్టం రద్దు అయ్యేంతవరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా
తెలంగాణ ఎంప్లాయిస్ జాక్ ఆధ్వర్యంలో సి పి ఎస్ ని రద్దుచేసి ఓ పి ఎస్ ని పునరుద్దరించాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్రోహదినంగా పాటించాలని తీర్మానించడం జరిగిందని ఇందులో భాగంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా జయశంకర్ సార్ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం వరకు జరిగే బైక్ ర్యాలీ లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.

Join WhatsApp

Join Now