రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాలి
సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంద కుమార్ మాదిగ
వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారుల నియోజకవర్గ సన్నాహక సదస్సు జయప్రదం చేయండి
ఆగస్టు 13 రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ రోడ్
సమయం మధ్యాహ్నం 12 గంటలకు
ముఖ్య అతిథి మందకృష్ణ మాదిగ
హుస్నాబాద్ ఆగస్టు 7..ప్రశ్న ఆయుధం :
హుస్నాబాద్ లోని రాజా రాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో హుస్నాబాద్, సిద్దిపేట నియోజక వర్గాల విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారు. సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాలి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ ” ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు.కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేశాడని అన్నారు. 2023 ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ 6 వేలు , మిగితా చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 4 వేలకు పెంచుతామని రేవంత్ రెడ్డి బహిరంగంగా హామీ ఇచ్చారు. ఈ నెల ఓటు వేయండి , వచ్చే నెల పెరిగే పెన్షన్ తీసుకొండని మాట్లాడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 20 నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. ఇది ఘోరమైన మోసం అని అన్నారు. ఈ మోసం గురించి ప్రతిపక్షాలు కూడా మాట్లాడకుండా చేయూత పెన్షన్ దారులకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. కాబట్టే 50 లక్షల మంది పెన్షన్ దారుల పక్షాన మంద కృష్ణ మాదిగ పోరాటానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అందులో భాగంగా తెలంగాణ నలుమూల తిరుగుతూ 13 వ తేదీన హుస్నాబాద్ లోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ కి వస్తున్నారని అన్నారు. సిద్దిపేట,హుస్నాబాద్ నియోజక వర్గ పరిధిలో ఉన్న అన్ని రకాల చేయూత పెన్షన్ దారులు మహాసభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుల చిట్యాల సంపత్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా మహిళా నాయకురాలు గుగులోతు రాజేశ్వరి విహెచ్పిఎస్ జిల్లా నాయకుడు జింక యాదగిరి ఎంఎస్పీ జిల్లా కో ఇన్చార్జ్ మల్లిగారి యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సామ్రాట్ ప్రకాష్ మాదిగ ఎమ్మెస్పీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి చుంచు రమేష్ మాదిగ ఎమ్మెస్పీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుగందుల లక్ష్మీనారాయణ
హుస్నాబాద్ మండల ఇన్చార్జి బత్తుల చంద్రమౌళి మాదిగ
పిహెచ్పిఎస్ నాయకుడు అభిరవేణి రాజు బోనగిరి రవి గడిపి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.