Site icon PRASHNA AYUDHAM

చర్లపల్లిలో అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో ఆందోళన..!!

IMG 20250627 WA0027

**చర్లపల్లిలో అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో ఆందోళన**

*అధికార అనుమతులు లేకుండానే నిర్మాణాలు – మౌనంగా ఉన్న మున్సిపల్ అధికారులు*

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా ప్రశ్న ఆయుధం జూన్ 27:

కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు బేధదీర్ఘంగా కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి రైల్వే కాలనీలోని సర్వే నంబర్ 190లో ఉన్న ప్లాట్ నంబర్లు 25, 26లపై ఎలాంటి అధికార అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టబడుతున్నట్టు తెలిసింది.

ఈ అక్రమ కట్టడాల విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి కలవరపెడుతోందని వారు వాపోతున్నారు.పట్టణాభివృద్ధి నియమాలను త్రోసిపుచ్చుతూ సాగుతున్న ఈ నిర్మాణాలు భద్రతా పరంగా కూడా ప్రమాదకరమని నివాసితులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Exit mobile version