Site icon PRASHNA AYUDHAM

“ప్రజలు చస్తున్నారు… ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది”.. హరీష్ రావు

IMG 20250824 151401

Oplus_16908288

“ప్రజలు చస్తున్నారు… ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది”.. హరీష్ రావు

“పారిశుధ్యం లేక గ్రామాలు మునిగిపోయాయి”

“ప్రభుత్వ నిధులు లేవు… సెక్రటరీలు అప్పుల పాలయ్యారు”

“ప్రజలు అప్పులుపెట్టుకుని వైద్యం కోసం తంటాలు పడుతున్నారు”

“ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పూర్తిగా పోయింది”

ప్రశ్న ఆయుధం ఆగష్టు 24 గజ్వెల్

హరీష్ రావు మాట్లాడుతూ,

“తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగ్యూతో చనిపోయారు. ఇంకా 40–50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హాస్టళ్లలోని పిల్లలు కూడా జ్వరంతో ఆసుపత్రులకే చేరారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఇంకేమిటి?” అని ప్రశ్నించారు.

“కేసీఆర్ హయాంలో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ పెట్టేవారు. కానీ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో నీతులు చెబుతున్నాడు. పంచాయతీల్లో నిధులు లేవు… అధికారులు సొంత డబ్బు పెడుతున్నారు. ఎంత సేపటివరకు ప్రతిపక్షంపై బురద జల్లుతారు?” అని ధ్వజమెత్తారు.

“కేసీఆర్ హయాంలో గజ్వేల్ రేక్ పాయింట్‌కి 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించేవారు. ఊర్లకు లారీలు చేరేవి. కానీ రేవంత్ హయాంలో యూరియా బస్తా దొరికితే అది లాటరీ దొరికినట్టే. మరోవైపు మందు షాపులు ఫుల్… మందులు మాత్రం శూన్యం. బార్లు, వైన్స్ పెడతానని చెబుతున్న సీఎం… ప్రజల ప్రాణాలు మాత్రం అగౌరవం అవుతున్నాయి.” అని మండిపడ్డారు.

“రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్లే మహేష్, శ్రావణ్ చనిపోయారు. వీరి మరణం సహజ మరణం కాదు… ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఇప్పటికైనా మేల్కొని పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు.

Exit mobile version