లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 22 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని ఎస్సీ కాలనీలో బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సోమవారం పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాల గోదావరి వరదల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు సమీపంలోని వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి గోదావరి వరద కూడా రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు, అత్యవసరమైతే తప్ప ఇంట్ల నుండి ఎవరు బయటకి రావద్దని వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని గోదావరి వరదను చూసేందుకు రావద్దని ఆమె చూసించారు లోతట్టు ప్రాంత ప్రజలు వరద మంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అధికారులు ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాలకు వెళ్లాలని ఆమె సూచించారు, వర్షాలతో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందందున అధికారులు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు చికిత్సకు అవసరమయ్యే మందులు అందుబాటులో ఉంచాలని ఆమె కోరడం జరిగింది
ఈ సందర్భంగా బూర్గంపాడు మండల బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు గోనెల నాని, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సాదిక్ పాషా, పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.