వణికిస్తున్న వైరల్‌ ఫీవర్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు.. 

వణికిస్తున్న వైరల్‌ ఫీవర్‌

ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు

IMG 20240827 WA0138

IMG 20240827 WA0137

సీజనల్‌ ఇన్‌ఫెక్షన్లు, వైరల్‌ ఫీవర్‌ కారణంగా గాంధారి పిహెచ్సి ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చికిత్స అనంతరం కోలుకోడానికి చాలా సమయం పడుతోంది.కొత్త రకం వైరల్‌ ఫీవర్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో, వైద్యులను సంప్రదించకుండానే చాలామంది యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నారు. ఇదిలా ఉండగా, యాంటీ బయాటిక్స్‌ వైరస్‏కు వ్యతిరేకంగా పనిచేయవని, ఇటువంటి విధానంతో నయం కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతాకాల సీజన్‌లో వైరల్‌ జ్వరాలు సాధారణమైనప్పటికీ, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు దగ్గు, జలుబు తదితర సమస్యలతో 15 రోజుల వరకు బాధపడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ఆస్పత్రుల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కాగా, చాలామంది ప్రస్తుతం మాస్కులు ధరించకపోతుండడంతో, వైరల్‌, ఇతర ఇన్‌ఫెక్షన్లకు సులభంగా గురవుతున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారు వైద్యులను సంప్రదించకుండా దుకాణాల్లో కొనుగోలు చేసే టాబ్లెట్లు, ఇతర టానిక్‌లను వాడడం శ్రేయస్కరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు వాడిన తర్వాత కూడా జ్వరం తగ్గని పక్షంలో రక్తపరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో పోషక విలువలు అధికంగా ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని గాంధారి మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు సూచిస్తున్నారు..

Join WhatsApp

Join Now