సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డాక్టర్ కళ్యాణ్
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి సీతంపేట గ్రామాలలో ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పల్లె దవకాన డాక్టర్ కళ్యాణ్ మెడికల్ క్యాంపు నిర్వహించారు వారు మాట్లాడుతూ జ్వరం ఉన్నవారికి 56 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు 13 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలు ప్రతి మంగళవారం ఇల్లందకుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్యామల హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ ఏఎన్ఎం రాజశ్రీ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.