సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటకు వెళ్లొద్దని, నియోజవర్గంలో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయని, ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. వివిధ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంఘ భవనాల్లో పునరావాసం పొందాలన, ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి
Oplus_131072