విష జ్వరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
జమ్మికుంట ఆగస్టు 26 ప్రశ్న ఆయుధం
మంగళవారం రోజున జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నగరం గ్రామములో డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 48 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ముగ్గురు జ్వర పీడీతులను గుర్తించి, వారి రక్త పూతల నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు ఆర్ డి టి కిట్స్ ద్వారా మలేరియా, డెంగీ పరీక్షలు నిర్వహించారు అలాగే జగ్గయ్యపల్లి గ్రామములో డాక్టర్ ఫర్హానుద్దీన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి 57 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు పదకొండు మందికి ఆర్ డి టి కిట్స్ ద్వారా మలేరియా, డెంగీ జాండిస్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అలాగే మున్సిపల్ పరిధిలోని మోతుకులగూడెం లో డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చందన సమక్షంలో సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో 94 మందికి చిన్న చిన్న దగ్గు, జలుబు జ్వరం ఉన్న వారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు అసంక్రామిత వ్యాధులు రక్త పోటు, మధుమేహం వ్యాధులు ఉన్న వారిని గుర్తించి,పరీక్షలు చేసి మందులు ఇవ్వడం చేశారు అలాగే పట్టణ పరిధిలోని దుర్గా కాలనీలో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి 63 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం మేరకు మందులు పంపిణీ చేశారు ఇందులో ముగ్గురు జ్వర పీడితులకు రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణకు ల్యాబ్ కు పంపించడం జరిగిందని వైద్య శిబిరాలకు వచ్చిన గ్రామస్తులకు, ప్రజలకు డాక్టర్స్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సీజనల్ వ్యాధులు కిటకాల ద్వారా, నీటీ ద్వారా, గాలి ద్వారా, కలుషిత ఆ హారం ద్వారా వ్యాపించు వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించి చెప్పినారు వ్యక్తి గత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు కాచి చల్లార్చిన మంచి నీటిని త్రాగాలని గ్రామస్తులకు సూచించిన్నారు. ఈ కార్యక్రమములో డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్ డాక్టర్ జూన్సీ, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్ వైజర్స్ సదానందం అరుణ కుసుమకుమారి దేవేందర్ రెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ ఇబ్రహీం ఐ సి టి సి కౌన్సిలర్ మహిపాల్ ఏఎన్ఎంఎస్ శ్యామల, రమ, సరళ, మంజుల,రజిత,రమాదేవి, ఆశా కార్యకర్తలు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.