ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
-బాలానగర్ సీఐ నర్సింహా రాజు.
హైదరాబాద్ సిటీ, కూకట్పల్లి , జూలై 26 (ప్రశ్న ఆయుధం):
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ సీఐ నర్సింహా రాజు సూచించారు. ఇంకా 48 గంటలు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినట్లు అయన శనివారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా వరదలు సంభవించినప్పుడు ప్రజలకు సహాయ,సహకారాలు అందించడానికి బాలానగర్ పోలీస్ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంట్ పోల్స్, మాన్ హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.పౌరులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం బాలానగర్ పిఎస్ నంబర్: 8712663209 కు కాల్ చేయవచ్చని, వెంటనే పోలీస్ యంత్రాంగం స్పందించి సహాయం అందిస్తుందని సీఐ నర్సింహా రాజు ప్రకటనలో వివరించారు. అంతేకాక సెక్టార్ I ఎస్ఐ వినోద్ -8712554136, సెక్టార్ II హాజీ మియా-8712663384, సెక్టార్ III&IV సరితా పటేల్ రెడ్డి,8712663201,హైడ్రా కంట్రోల్ రూమ్ 040-29555500,8712663209,9000113667లేదా ది ఐసీసీసీ కంట్రోల్ రూమ్ 8712674000 నెంబర్ లకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం సంప్రదించవచ్చని, బాలానగర్ పిఎస్ నందు ఏర్పాటు చేసిన నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని,ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ నర్సింహా రాజు మరోసారి విజ్ఞప్తి చేశారు.