Site icon PRASHNA AYUDHAM

భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

IMG 20250808 WA0006

భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

—జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 8

 

 

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు.

 

శుక్రవారం జిల్లా కలెక్టర్ భారీ వర్షంలో పాల్వంచ మండలంలోని భవానిపేట్, నుండి పోతారం, వెళ్లే దారిలో గల భావానీపేట్ వాగును, ఉధృతిని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి ఉధృతి అధికంగా ఉన్నందున నీటి ప్రవాహము వంతెన కంటే ఒక ఫీట్ వరకు రాకముందే ఈ దారిలో వాహనములు మరియు మనుషులు, జంతువుల రాకపోకలు ఆపివేయాలని ఆర్ అండ్ బి ఈఈ మోహన్, మరియు డిఈలను, జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు వర్ష సూచికలు తీసుకొని గ్రామాల వాట్స్అప్ గ్రూపులు మరియు దండోరా ద్వారా ప్రజలకు సమాచారం చేరవేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version