మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దుని, వివిధ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు మత్తల్లు దుంకుతున్నాయని, ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం దయచేసి చేయొద్దని సూచించారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంఘ భవనాల్లో కానీ పునరావాసం పొందాలని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించి, వారి సూచనలను సహాయ, సహకారాలను పొందాలని, ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏ గ్రామంలోనైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ఆంజనేయులుగౌడ్ పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
Oplus_131072