ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి.

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి.

 

*• భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం.*

*• గణేష్ మండపాల నిర్వహణలో భద్రత, నియమనిబంధనలు తప్పనిసరి.*

*• తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు….*

*• లింక్: https://policeportal.tspolice.gov.in/*

_*జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్.,*_

 

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 19

 

 

జిల్లాలో గణేష్ మండపం నిర్వహణకు మండపాల నిర్వహకులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ https://policeportal.tspolice.gov.in/ నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఈ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ద్వారా మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు.

గణేష్ మండపాల నిర్వాహకులు పాటించవలసిన నియమనిబంధనలు.

1.గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే.

2.ప్రతీ మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

3.నిర్దేశించిన సమయనికి నిమర్జనం పూర్తి చేయాలి. ఈ నిమర్జన తేదీని ఆన్లైన్ అప్లికేషన్ లో పేర్కొనాలి.

4.గణేష్ మండపాలు ప్రజా రవాణాకు,ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

5. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారి అనుమతులు తప్పనిసరి.

6.గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్ల ను మండపంలో ఏర్పాటు చేయాలి.

7.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. DJలు ఉపయోగించడం కోర్ట్ దిక్కరణగా పరిగణించబడుతుంది. మండపాల్లో శోభాయాత్ర సందర్భంగా ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయరాదు.

 

8. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.

9.గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.

10. గణేష్ మండపాల వద్ద ఎప్పుడైనా అగ్నిప్రమాదం సంభవించకుండా ముందు జాగ్రత్తలో భాగంగా Fire extinguishers, Fire Balls లేదా రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద మండపాల వారు తప్పనిసరిగా Fire extinguishers ని అమర్చుకోవాలి..

11. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.

12.విధిగా ప్రతి మండపం దగ్గర ఒక తనిఖి పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారుల లేదా ఇతర ప్రభుత్వ అదికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.

13.మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

14. దీపం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఇసుక పైన గాని లేదా బియ్యం పైన గాని పెట్టండి. ఇలా పెడితే అది కింద పడిన అగ్ని ప్రమాదం సంభవించదు.

15. వర్షాలు ఎక్కువగా ఉన్నందున దానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి . విగ్రహాలు నానితే నిమర్జనం సమయంలో ఇబ్బంది కావచ్చు. అలాగే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాకుండా నిపుణుడితో ఎలక్ట్రిఫికేషన్ చేయించుకోవాలి

16. పరదాలు గాలికి ఎగిరి దీపం వలన అగ్ని రాదుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి.

*17. విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు దాని రవాణాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు తీగలకు తగిలి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. తేదీ 19. 08.2025 నాడు మాచారెడ్డి లో 20 ఫీట్ల విగ్రహం కరెంటు తీగకు తగిలి ఒక వ్యక్తి ప్రాణాలు పోవడం జరిగింది.*

సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా DAIL 100 కి సమాచారం అందించలని సూచించారు.

Join WhatsApp

Join Now