*ప్రజలందరూ సామరస్య వాతావరణ హోలీ పండుగ వేడుకలు జరుపుకోవాలి*
*
*ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు*
*పట్టణ సీఐ వరగంటి రవి*
*జమ్మికుంట మార్చి 13 ప్రశ్న ఆయుధం*
ప్రజలు హోలీ పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు గురువారం జమ్మికుంట పట్టణంలోని గుల్జార్ మసీదు వద్ద ఉపవాస దీక్షలో ఉన్న పలువురు ముస్లింలతో సీఐ రవి సమావేశం నిర్వహించి మాట్లాడుతూ హోలీ, రంజాన్ మాసం శుక్రవారం ఒకే రోజు వస్తున్నందున ప్రజలందరూ సౌబ్రాతృత్వంతో మెలగాలని, హోలీ పండుగ వేడుకలు అన్ని మతాలవారు జరుపుకుంటారనీ అందరు వారి వారి అభీష్టం మేరకే హోలీ సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. అన్య మతాల వారిపై బలవంతంగా రంగులు చల్లె ప్రయత్నం చేయవద్దని, ఎవరైనా అలా ప్రయత్నిస్తే సున్నితంగా తెలపాలని పేర్కొన్నారు ఎక్కడైనా ఘర్షణ వాతావరణం నెలకొంటే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని అదేవిధంగా హోలీ పండుగ సందర్భంగా స్థానిక ప్రజలు బిర్యానీ పాయింట్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడుతూ రాత్రి 10 గంటల వరకు బిర్యాని పాయింట్ మూసివేయాలని హోలీ రోజున వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్లకూడదని రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని, వాహనాలపై వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వారి వారి ఇంటి వద్దనే హోలీ సంబరాలు జరుపుకోవాలని సిఐ రవి సూచించారు ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు