ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి పరిష్కరించాలి

*ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి పరిష్కరించాలి*

*నూతన తహసిల్దార్ రాజును మర్యాదపూర్వకంగా కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

*జమ్మికుంట మే 6 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల తహసిల్దారు గా బదిలీపై వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించిన చలమల్ల రాజు ని మంగళవారం రోజున స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ యువజన కాంగ్రెస్ కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చైతన్య రమేష్, సంధ్యా నవీన్, సెక్రటరీ సజ్జు అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, ప్రధాన కార్యదర్శి అజయ్, కార్యదర్శులు గొడుగు మానస, రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, మండల కమిటీ ఉపాధ్యక్షులు వినయ్, శ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మహేష్, కార్యదర్శులు రవి, అజయ్, 15వ వార్డు అధ్యక్షులు మైస సురేష్, 22వ వార్డు అధ్యక్షులు మొలుగూరి రమేష్, యువజన నాయకులు ప్రవీణ్, జావీద్, శివ, శ్రీకాంత్, భాను, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now