*ప్లాస్టిక్ కు ప్రజలు బై బై చెప్పాలి… జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలి*
*మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ ఆయాజ్*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 20*
ప్లాస్టిక్ కవర్లకు ప్రజలు బై బై చెప్పాలని జమ్మికుంట మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు శుక్రవారం జమ్మికుంట మునిసిపాలిటి పరిధిలోని మహిళా సంఘ సభ్యులకు ప్లాస్టిక్ నివారణపై మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ అవగాహన కల్పించారు కమీషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ వార్డులలోని సంఘ సభ్యులు చెత్తను వేరుచేయాలని తడిచెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు కూరగాయలు, కిరాణ సామాన్లుకొనేందుకు వెళ్ళేటప్ప్పుడు ప్లాస్టిక్ కవర్లు కాకుండా జ్యూట్ బాగ్స్ ఉపయోగించాలని అన్నారు నీరు నిల్వ ఉన్న చోట ఎప్పటికప్పుడు నీరును పారబోయలన్నారు. లేనియెడల దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి ఇంచార్జి టి.ఎం.సి. మానస, హెల్త్ అసిస్టెంట్ మహేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, సీఎల్ఆర్పీ జ్యోతి, ఆర్పీలు ఉమాదేవి, విజయలక్ష్మి, అనుష, భాగ్యలక్ష్మి, షాహీనలతో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.