*ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం: ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ‘సేవా పక్షం’లో భాగంగా నాగారంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అపోలో హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ప్రారంభించారు.
నాగారంలోని రామకృష్ణ నగర్ కమ్యూనిటీ హాల్ (14వ వార్డు)లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్, కంటి, దంత, క్యాన్సర్ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యానికి వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించడం ప్రశంసనీయం. మున్సిపాలిటీలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తాము. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 14వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, రామక్కపేట రవీందర్ రెడ్డి, మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.