Site icon PRASHNA AYUDHAM

న్యాయ విజ్ఞాన సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. సివిల్ జడ్జ్ పి.బి కిరణ్ కుమార్

IMG 20250823 WA0044

న్యాయ విజ్ఞాన సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..

సివిల్ జడ్జ్ పి.బి కిరణ్ కుమార్

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం

శనివారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీరామ మానవ సేవ వృద్ధాశ్రమంలో హుజురాబాద్ కోర్ట్ సివిల్ జడ్జ్ పి.బి కిరణ్ కుమార్ న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు శ్రీరామ మానవసేవ వృద్ధాశ్రమంలో హుజురాబాద్ కోర్టు సివిల్ జడ్జ్ కిరణ్ కుమార్ వృద్ధులకు స్వీట్లు పండ్లు పంపిణీ చేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు వృద్ధులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ న్యాయ శాస్త్ర కోవిదులు అధికార అనాధికార ప్రముఖుల సమక్షంలో స్నేహపూరిత వాతావరణం లో ఉభయ పక్షాలకు ఆమోద్యయోగ్యమైన తీర్పు ద్వారా మీ కేసులలో తుది పరిష్కారం పొందాలని, వ్యాయాప్రాయాసాలు లేని సత్వర న్యాయం పొందాలంటే లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని చిరకాలంగా కోర్టుల లో పరిష్కారం కాకుండా నిలిచిపోయిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తక్కువ వ్యవధిలో ఖర్చు లేకుండా కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. కోర్టుకు కేసు వెళ్ళని పక్షంలో సదరు పార్టీల వారు తమ యొక్క తగాదాలను పరిష్కరించుకోవలసినదిగా సంబంధిత జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను గాని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను గాని కోరవచ్చు పలుమార్లు తిరగవలసిన పని లేకుండా సహోద్భవ వాతావరణంలో అప్పీలు లేని న్యాయబద్ధమైన లోక్ అదాలతను వినియోగించుకోవాలని తెలిపారు హుజరాబాద్ కోర్టు సివిల్ జడ్జి కిరణ్ కుమార్ తో శ్రీరామ మానవ సేవ వృద్ధాశ్రమ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ బచ్చు శివకుమార్ పోలీసులు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు,

Exit mobile version