ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండలం స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్ 16
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో గల సింగభూపాలెంప్రాజెక్టు నందు ప్రతి సంవత్సరం చేప పిల్లలను ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ఇందులో ప్రభుత్వం డబ్బు ఖర్చుపెట్టి లక్షలాది చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆ స్థానిక ఎమ్మెల్యే మంత్రుల ద్వారా చేపట్టడం జరుగుతుంది
ప్రతియేటా ఇదేవిధంగా చేపలు పిల్లల్ని విడుదల చేస్తూ సంవత్సరం తర్వాత కొత్తగూడెం మత్స్యశాఖ సహకారంతో చేపలను చెరువు ద్వారా పెంచుతూ వస్తున్న ప్రభుత్వ మచ్ సహకార సంఘం ప్రతి సంవత్సరం ఈ చెరువుపై ఉన్న సభ్యులు అమ్మకానికి ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత అమ్మకాలు మొదలుపెడతారు సింగభూపాలెం ప్రాజెక్టు ఆయకట్ట సుమారు 2500 ఎకరాలు వరకు నీటి సౌలభ్యత కలిగి ఉంటుంది ఈ చెరువుపై సభ్యులు సుమారుగా 500 మంది వరకు ఉంటారు ఈ చెరువు ఆయకట్ట సింగభూపాలెం సుజాతనగర్ మంగపేట చుంచుపల్లి కొత్తజనాపురం పాతంజనాపురం మంగపేట నరసింహసాగర్ తదితర గ్రామాలకు ఈ ఆయకట్ట ద్వారా నీరు సరఫరా అవుతుంది సభ్యులు సహకారంతో
చేపలు పడుతూ స్థానికులకు సరైనద ప్రాధాన్యత ఇవ్వని చాపల చెరువు సభ్యులు ప్రతి సంవత్సరం పది రూపాయల చొప్పున రేటు పెంచుతూ చేపలను విక్రయిస్తున్న వైనం ఇలా ప్రతి సంవత్సరం చాపలు రేటు పెంచుకుంటూ పోతే స్థానికులు చేపలు ఎలా తినాలి అని వాపోతున్నారు
చేపలు అమ్ముకునే గంపల వాళ్లకు కిలో 70 నుంచి 80 రూపాయలు అమ్ముతూ స్థానికులకు స్థానికేతులకు మరి ఇతరులకు 140 రూపాయలు చొప్పున విక్రయిస్తున్న సభ్యులు ఇదేమి అని స్థానికులు ప్రశ్నించగా స్థానికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న సభ్యులు చిన్న చేపలు అమ్ముతూ ఈరోజుకి ఇవే చేపలు ఉన్నవి కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు అని సమాధానం చెబుతూ జనాలపై హుకుం జారీ చేస్తున్నారు సింగభూపాలెం చెరువు చేపలంటే ఈ జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత ఈ చెరువులో కొనేటందుకు ఈ జిల్లా వాసులు నలుమూల నుంచి ఈ చెరువు వద్దకు వచ్చి చాపలు కొనుక్కొని పోతూ ఉంటూ ఉండేవారు ఈ సంవత్సరం పెంచిన ధరలను చూసి జనం బెంబేలెత్తి వామ్మో అంటూ చాపలు కొనలేని పరిస్థితి గ్రామస్తులకి ఒక రకమైన చాపల అమ్ముతూ అమ్ముకునే గంపల వారికి మరో రకమైన చాపలు అమ్ముతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు బయట చేపలకు రేటుకు మరియు చెరువు దగ్గర చాపల రేటుకు కొద్ది మాత్రం తేడా ఉన్నందున ప్రజలు ప్రభుత్వానికి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు జిల్లా మత్స్యశాఖ అధికారులు ఈ విషయంన్నీ పరిగణలోకి తీసుకొని సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని చేరవేసి పరిసర ప్రాంత ప్రజలకు రేట్లు అందుబాటులో ఉండే విధంగా రేట్లను సరిచేసి అమ్మాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు అదేవిధంగా సింగభూపాలెం ప్రాజెక్టులో సభ్యత్వం ఉన్న సభ్యులతో కాకుండా ఇతరులతో చేపలు పట్టించి వాటిని లారీల ద్వారాఎవరికి తెలియకుండా బయటి వారికి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లివెత్తుతున్నవి చాపలు కొందామని ఆశతో చెరువు దగ్గరకు వస్తే నిరాశతో వెను తిరుగుతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు పట్టించుకోని చెరువులో నాణ్యమైన సరసమైన ధరలకు ప్రజలకు అందించాలని సుజాతనగర్ మండల ప్రజలు కోరుతున్నారు