కుల భోజనాలు కాదు – జన భోజనాలు..

కుల

కుల భోజనాలు కాదు – జన భోజనాలు.. TPS

తెలంగాణ ఉద్యమకారుల సంఘంవారి ఆత్మీయ సమ్మేళనం

ఆధునిక సమాజంలో కుల అంతరాలు ఉండటం కులాల పేరుతో వనభోజనాలు ఏర్పరచుకోవటం సమాజానికి ప్రజల ఐక్యతకి ప్రమాదకరమని తెలంగాణ ఉద్యమకారుల సంఘం TUS నాయకులు అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కులాల పేరుతో భోజనాలు ఏర్పాటు చేయటం సమాజానికి ముప్పన్నారు. కుల భోజనాలు కాదు జన భోజనాలు జరగాలని పేర్కొన్నారు.

వైరా ప్రాజెక్టు వద్ద గుట్టల మీద ఉన్న పర్యాటక భవనంలో ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జన భోజనాలు నిర్వహించారు అనంతరం సంఘం అధ్యక్షులు ఎస్.కె పాషా అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ సభలో ప్రధాన కార్యదర్శి గౌరవరపు జగదీష్ (డేవిడ్ రాజు) ప్రారంభ ఉపన్యాసం చేశారు

వివిధ పార్టీల నాయకులు పుర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాని సాధించిన ఉద్యమకారులు సంఘంగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా కుల భోజనాలు కాదు జన భోజనాలు చేయాలంటూ సాంఘిక బాధ్యతగా కార్యక్రమాలు నిర్వహించటం చాలా గొప్ప విషయమని అన్నారు అనాగరిక సమాజంలో ఏర్పరచుకున్న కులాల రుగ్మత నేటి ఆధునిక సమాజంలో కూడా కులాల పేరుతో విడిపోయి వనభోజనాలు ఏర్పాటు చేయటం సమాజానికి నష్టమని అన్నారు. ఉద్యమకారుల సంఘం హక్కుల పరిష్కారానికి తాను కూడా కలిసి పోరాడుతానని చెప్పారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి వివరిస్తానని చెప్పారు సంఘ నాయకులను మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి న్యాయమైన కోరికల పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు

టిపిసిపి కార్యదర్శి కట్ల రంగారావు, సిపిఐ డివిజన్ కార్యదర్శి ఎర్రబాబు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ కాప మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో కులాల అంతరాలు పోవాలని సమ సమాజం రావాలని ప్రతి కులాన్ని గౌరవిస్తూ సమాజంలో ఐక్యతను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు

టి యు ఎస్ డిమాండ్ల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నాయకులు తెలిపారు

ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ లగడపాటి ప్రభాకర్ సంఘ గౌరవ అధ్యక్షులు యామల గోపాలరావు,పూర్ణ కంటి రామారావు, ప్రచార కార్యదర్శి ఎస్ కె లాల్ మియా వర్ధ బోయిన బాబు, లైన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ శ్యామ్ బాబు నాయకులు ఓర్సు శ్రీనివాసరావు, నూకల ప్రసాద్ సయ్యద్ అతావుల్లా, నల్లగట్ల బాబు, మనుబోలు వెంకటకృష్ణ, గిద్దగిరి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు భుఖ్య బిటు నాయక్ కన్నెగంటి నగేష్, కన్నెగంటి హుస్సేన్, పెద్దప్రోలు లక్ష్మయ్య కొండలు ప్రశాంత్ సైదుబాబు కన్నెగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment