దమ్మాయిగూడలో ఆగని అక్రమ కట్టడాలు: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!

*దమ్మాయిగూడలో ఆగని అక్రమ కట్టడాలు: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!*

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ, ప్రశ్న ఆయుధం జూలై 11

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చిర్యాల, కీసర, యాద్గార్‌పల్లి గ్రామాల్లో అనుమతులు లేని నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ అక్రమ కట్టడాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.

స్థానికులు చెబుతున్న ప్రకారం, ఈ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందనా కనిపించలేదు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. మున్సిపల్ ఖజానాకు లక్షల రూపాయల ఆదాయం కోల్పోతున్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఎంతమంది అధికారులు మారినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదని, కొత్తగా వచ్చిన అధికారులు అయినా చర్యలు తీసుకుంటారనే ఆశకు కూడా తూట్లు పొడుస్తున్న స్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

“వేతనాలతో పాటు లంచాలు తీసుకుంటూ అక్రమ కట్టడాలకు ప్రోత్సాహం ఇస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి,” అని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now