అల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో పతకాలు సాధించిన ఎల్ఎఫ్ఎస్ విద్యార్థులు

చాంపియన్
Headlines
  1. “ఎల్ఎఫ్ఎస్ విద్యార్థులు అల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో పతకాలు సాధించారు”
  2. “కరీంనగర్ లో జరిగిన కరాటే పోటీల్లో ఎల్ఎఫ్ఎస్ విద్యార్థులు బంగారు, వెండి పతకాలు”
  3. “కరాటే లో విజయం సాధించిన ఎల్ఎఫ్ఎస్ విద్యార్థులు, స్కూల్ కోచ్ అల్లె రమేష్ ను సన్మానం”
  4. “ఎల్ఎఫ్ఎస్ విద్యార్థులు కరాటే పోటీల్లో సాధించిన విజయం: పిల్లలకు ఆత్మరక్షణకు కరాటే ఉపయుక్తం”

అల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో కోరుట్ల ఎల్ఎఫ్ఎస్ విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారు. కాంటినెంటల్ షోటోకన్ కరాటే డు ఇండియా.(సిఎస్ కెఐ) ఆధ్వర్యంలో అల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్, సీనియర్ సినీ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు మెమోరియల్ కప్ 2024 పోటీల్లో నవంబర్ 22,23,24,వ తేదిల్లో మూడు రోజుల పాటు కరీంనగర్ లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కటా, కుమ్మితే క్యాటగిరిలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు కుందారపు బన్శిధర్ (06,వ తరగతి) కటా విభాగంలో బంగారు పతకం, ఇందూరి హర్షిత్ (04,వ తరగతి) కటా విభాగంలో ఒక వెండి పతకం సాధించారు. ఈ సందర్బంగా స్కూల్ వ్యవస్థాపకులు తుమ్మనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు వారి మానసిక ఉల్లాసనికి, ఆత్మ రక్షణకు కరాటే లాంటి కార్యక్రమాలు దొహదపడతాయని తెలిపారు. అనంతరం పతకాలు సాధించిన విద్యార్థులను, కోచ్ అల్లె రమేష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ తుమ్మనపల్లి మనోజ్ కుమార్, ప్రిన్సిపాల్ సిరికొండ గంగాధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment