టపాసుల దుకాణం ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
వనస్థలిపురం ఇన్స్పెక్టర్ టి మహేష్ కుమార్
వనస్థలిపురం, అక్టోబర్ 16 : ( ప్రశ్న ఆయుధం) తాత్కాలిక టపాసుల దుకాణం ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పని సరిగా అనుమతులు పొందాలని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ టి మహేష్ కుమార్ సూచించారు. గురువారము ఆయన మాట్లాడుతూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాసంచా షాపుల యజమానులు ఫైర్ సేఫ్టీ అనుమతులు, నియమ, నిబంధనలు కచ్చితంగా పాటించాలని, టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాలల్లో జన వాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు. బాణా సంచా దుకాణం వద్ద ఇసుక బకెట్, డ్రమ్ములో నీరు, సిఓ2, డ్రై కెమికల్ పౌడర్, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచు కొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారు.