జీవదాన్ స్కూల్ లో ఆరేళ్ల చిన్నారిపై పిఈటి వికృత చేష్టలు

కామరెడ్డి జీవదాన్ స్కూల్ లో ఆరేళ్ల చిన్నారిపై పిఈటి వికృత చేష్టలు

పీఈటిని అరెస్టు చేయాలని ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు

జీవదాన్ పాఠశాల ముందు మున్సిపల్ చైర్ పర్సన్ ధర్నా, డీఈఓ కు ఫిర్యాదు

పోలీసుల భారీ భందోబస్థు.. పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత

కామారెడ్డి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత, సీఐ చంద్రశేఖర్ రెడ్డికి గాయాలు

పాఠశాలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 24, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ హైస్కూల్ లో నర్సరీ చదువుతున్న ఆరు సంవత్సరాల చిన్నారిపై పాఠశాల పీఈటి నాగరాజు వికృత చేష్టలకు పాల్పడినట్లు పాప తల్లిదండ్రులకు తెలపడంతో పాప తల్లిదండ్రులు వచ్చి పీఈటిని నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు మంగళవారం పాఠశాలకు వచ్చి పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ ను నిలదీశారు. పాఠశాలపై సరియైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే పీఈటి నాగరాజు ఆరు సంవత్సరాల చిన్నారి బాలికపై వికృత చేష్టలకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. పీఈటి నాగరాజును పాఠశాల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్ లతో వచ్చి పాఠశాల ఎదుట ధర్నా నిర్వహిస్తూ, పాఠశాల విద్యాశాఖ అధికారి రాజుకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఆందోళన చేపట్టారు. ఆరు సంవత్సరాల చిన్నారి బాలికపై వికృత చేష్టలకు పాల్పడిన పిఈటిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని పాఠశాల నుంచి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు పెద్ద ఎత్తున తరలి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున పాఠశాలకు తరలివచ్చి బందోబస్తు నిర్వహించినా, విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహంతో పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు గంటల పాటు కామారెడ్డి – నిజాంసాగర్ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు పాఠశాల ప్రిన్సిపల్, పిఈటిలను పై విద్యార్థుల తల్లిదండ్రులు దాడికి యత్నించారు . పీఈటి నాగరాజును వెంటనే అరెస్టు చేయాలి డిమాండ్ చేశారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పాఠశాలలో వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తోపులాటలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పీఈటి నాగరాజును పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ విషయంపై పాఠశాల యజమాన్యం పోలీసులకు పీఈటి నాగరాజు పై ఫిర్యాదు చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాఠశాలకు తరలివచ్చి పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ ను నిలదీశారు. ఇప్పటికీ పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు.

కామారెడ్డిలో ఉద్రిక్తత.. సీఐ చంద్రశేఖర్ రెడ్డి కి గాయాలు

కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాల వద్ద యూకేజీ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పీఈటి నాగరాజ్ పై చర్యలు తీసుకోవాలని చేపట్టిన ఆందోళనలో పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి ఎస్ఐ రాజులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీలను ధూళిపించారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

Join WhatsApp

Join Now