వినతి పత్రం

IMG 20240911 WA2901

బొమ్మెర శ్రీనివాస్ అందజేశారు

ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థానిక రిజర్వేషన్ 2014 ఆధారంగా

2024 స్థానిక ఎన్నికలు నిర్వహించి ఎస్సీ కులాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు

 

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలను ఎస్సీలుగా గుర్తించి వెనుకబాటుతనానికి గురైన ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలను అభివృద్ధిలో ముందు ఉంచాలని ఆరోగ్యశాఖ మంత్రికి విన్నవించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల తొలగించిన స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినo దున ఎస్సీ రిజర్వేషన్ 20 శాతం పెంచాలని తెలియజేశారు.విద్య ఉద్యోగ,ఉపాధి,రాజకీయపరంగా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు నామినేట్ పదవులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో ఏజెన్సీ ప్రాంత సభ్యులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధినీ చేయాలని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడే న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు రజిని అంబేద్కర్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ నాయకులు బి.సంపత్ కుమార్, ఎనగంటి కృపాకర్ కండే మహేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now