*కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కి విఆర్ఏల సమస్య ల వినతి పత్రం అందించారు*
నారాయణ పేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం రోజు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుముల తిరుపతి రెడ్డి హాజరు అయ్యారు.. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల విఆర్ఏ వారసులకు.గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జి.ఓ.ఎం.ఎస్. నెం. 81 & 85, తేది : 21-11-2024 ప్రకారం 3797 మంది 61 సం లు పైబడిన విఆర్ఎల వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇప్పించుట గురించి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎలను రెగ్యులర్ చేస్తూ కారుణ్య వారసత్వ నియామకాల కోసం జి.ఓ. ఎం. ఎస్. నెం. 81 మరియు 85 ప్రకారం 3797 మంది 61 సం లు పైబడిన వారి వారసులకు ఉద్యోగ నియామకం కోసం జీవోలు జారిచేయబడినాయి. కాని ఇట్టి జీవోలపైన స్టే ఉన్న కారణంగా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. కాని తేది : 21-11-2023 రోజున హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులనుసారం జి.ఓ నెం. 81 పైన గల స్టే ఎత్తివేసిన విషయం తమరికి తెలిసినదే.గత 5 నుండి 10 సంవత్సరాలుగా 61 సం దాటిన విఆర్ఎ వారసులము ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండడం వలన మా సేవలను ఎమ్మార్వో కార్యాలయాలలో అందిస్తూనే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మావంతు కృషి.కూడా.చేస్తున్నాము..రాష్ట్రంలో గల 3797 మంది 61 సం నిండిన విఆర్ఎ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనందువలన మా యొక్క కుటుంబాల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరియు మానసికంగా కూడా ఎంతో కుంగిపోతున్నారు. ఇప్పటివరకు 17 మంది విఆర్ఎ లు కూడా మరణించడం జరిగింది. జీవో నెం. 81 మరియు 85 ప్రకారం మొత్తం 20555 మంది విఆర్ఎలలో16758 మంది వివిధ డిపార్ట్మెంట్లలో వారి వారి అర్హతలనుబట్టి నియామక ఉత్తర్వులు, ఐడీలు కూడా ఇవ్వడం జరిగింది. కాని మా 61 సం లు పైబడిన విఆర్ఎ వారసులకు ఇప్పటి వరకు ఎలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. కావున మా యందు దయతలచి మా 3797 మంది 61 సం ల పైబడిన విఆర్ఎల వారసులకు నియామక ఉత్తర్వులు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకోవలసినదిగా మనవి చేస్తున్నాము…..