ఠాగూర్ కళాశాలపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కు వినతి.. ..

ఠాగూర్ కళాశాలపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కు వినతి..

ఠాగూర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి…

పర్మిషన్లు నిల్ అడ్మిషన్లు ఫుల్..

ఏఐపీఎస్యు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్..

IMG 20240831 WA0072

IMG 20240831 WA0069 IMG 20240831 WA0070

AIPSU నాయకులు బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్ కిరణ్మయి కి వినతి పత్రం అందజేశారు. బాన్సువాడ పట్టణంలో గల ఠాగూర్ కళాశాలకు అనుమతులు లేకున్నప్పటికీ హాస్టల్ నిర్వహించడం జరుగుతుందని ఏఐపిఎస్యు నాయకులు అన్నారు. ఇట్టి విషయమై సంబంధిత కళాశాల యాజమాన్యానికి ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం లేకుండా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే విధంగా మాట్లాడడంతో, ఠాగూర్ కళాశాలపై కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి ఇట్టి విషయాన్ని తమ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ డి ఐ ఈ ఓ  సాకులు చెబుతూ కాలం వెళ్ళదిస్తున్నారని ఏఐపిఎస్యు నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘం నాయకులను, మీడియా ప్రతినిధులను తప్పుడు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని AIPSU విద్యార్థి సంఘ నాయకుల ఆవేదం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐపిఎస్యు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ… బాన్సువాడ పట్టణంలో గల ఠాగూర్ కళాశాల హాస్టల్ కు పర్మిషన్ లేకుండా నడపడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఠాగూర్ కళాశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. అర్హత కలిగిన అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అట్టి కళాశాలపై తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ని కోరడం జరిగింది..

Join WhatsApp

Join Now