కృష్ణ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం
ప్రశ్న ఆయుధం నవంబర్ 28: శేరి లింగంపల్లి ప్రతినిధి
శేరి లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ సుబాష్ చంద్రబోస్ నగర్ కాలనీ దర్గా నుండి విజ్ఞాన్ కాలేజ్ వరకు రోడ్డు, ఉన్నది. ఈ కాలనీ మధ్యలో సైబర్ విలేజ్. సైబర్ వ్యాల్యూ కృష్ణానగర్ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీలకు అనుసంధానంగా ప్రధాన రహదారిగా అందరం ఈ రోడ్డుమీద, నిత్యం రాకపోకలు సాగిస్తుంటాము అయితే మధ్యలో లెఫ్ట్ సైడ్ లో సైపర్ ప్లామ్స్ రైట్ సైడ్ లో ఓపెన్ ల్యాండ్ కళ్యాణ్ ది కలదు. ఫ్లమ్స్ విల్లాస్ వారు, గార్డెన్ సరిహద్దు దాటి రోడ్డు మీదకి ఆక్రమంగా 10 ఫీట్స్ దాటి ఐరన్ ఫినిషింగ్ ఏర్పాటుచేశారు. రోడ్డు మీదకి వస్తే ఎలా అని మేము మా తోటి నాలుగు కాలనీ అసోసియేషన్ సభ్యులం వెళ్లి అడిగితే మేము జిహెచ్ఎంసి దగ్గర అనుమతి తీసుకుని వేస్తున్నాము అని మాకు చెబుతున్నారు. దీనివల్ల నిత్యం రద్దీగా ఉండే ఈరోడ్డు చిన్నది అయిపోయింది. మేము స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళితే, ఆయన డిప్యూటీ కమిషనర్ కి కూడా తెలియజేయడం జరిగింది, డిప్యూటీ కమిషనర్ దీని గురించి విచారిస్తామన్నారు. కానీ ఇంకా, దీని గురించి ఏమి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఆ విల్లాస్ వారు వర్క్ మాత్రం చేస్తున్నారు, నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు. అక్రమ దారుల నుండి ఈ ఫినిషింగ్ నీ తొలగించవలసిందిగా మా నాలుగు కాలనీల
అసోసియేషన
తరపున మేము విన్నవించుకుంటున్నాము దయచేసి మా యందు
దయవుంచి ఈ ఆక్రమణలను తొలగించవలసిందిగా కోరుచున్నాము