ప్రధాన రహదారిపై మురికి నీరు చేరి గుంతల మయం అవుతుందని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం

*ప్రధాన రహదారిపై మురికి నీరు చేరి గుంతల మయం అవుతుందని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం*

*స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ*

*సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంగ రామకృష్ణ*

*ఇల్లందకుంట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం*

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అయినటువంటి జమ్మికుంట నుండి పరకాల భూపాలపల్లి వెళ్లే రహదారి డ్రైనేజీ మురికి వాటర్ వచ్చి గుంతల మయం అవుతుందని పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని సోమవారం రోజున మండలంలోని సిరిసిల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగ రామకృష్ణ ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు

IMG 20241230 WA0048

సందర్భంగా వంగ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాన రహదారిపై డ్రైనేజీ వాటర్ రావడం వలన గుంతల మయం అవుతుందని అనేకసార్లు రోడ్డుపై బైఠాయించి రోడ్డును తాత్కాలికంగా మరమత్తు చేస్తున్నారే తప్ప మురికి నీరు వెళ్లేందుకు సరియైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని ఆర్ అండ్ బి అధికారులకు గ్రామపంచాయతీ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనాడు కూడా రోడ్ల విషయంలో పట్టించుకోవడంలేదని కలెక్టర్కు వివరించడం జరిగిందని వంగ రామకృష్ణ తెలిపారు రోడ్లపై మురికి నీరు చేరడం వలన రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బైకులపై వెళ్లే ప్రయాణికులకు ముఖ్యంగా వారి వస్త్రాలు మురికిమయం అవుతున్నాయని కొందరు ప్రయాణికులకు గాయాలు అవ్వడం జరిగిందని తెలిపారు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో తూతూ మంత్రంగా ప్రధాన రోడ్ల మరమ్మతు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా శాశ్విత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులకు డిపిఓ అధికారులకు రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారని రామకృష్ణ తెలిపారు

Join WhatsApp

Join Now