బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
గజ్వేల్ : 10 జనవరి 2025
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర పార్ట్ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల్ రెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా జిల్లా కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మార్కంటి ఎగొండ, గజ్వేల్ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, పంజా బాలయ్య ఆధ్వర్యంలో తాసిల్దార్ కి మెమోరాణం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం ఎటువంటి అంశాలు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ పూర్తి చేయాలి ఎకరాకు 15000 రూపాయలు రైతు భరోసా విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు చెల్లించాలి. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, గజ్వేల్ మండల కిసాన్ మోర్చా పంజా బాలయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు కుంకుమ రాణి, మహిళా మెడ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు మంతూరి మమత, భక్తమాల మోర్చా జిల్లా కార్యదర్శి ఆలేటి సుమతి, గజ్వేల్ పట్టణ మండల ఉపాధ్యక్షులు నాయని సందీప్, మైస విజయ్,బీజేపీ మండల ఉపాధ్యక్షులు బారు అరవింద్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి అయిల మహేందర్, కిసాన్ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు గుంటూరు రమేష్ , స్వరోజి, బీజేపీ నాయకులు బీనమైన ప్రభాకర్, బాలకోటి, గజ్వేల్ పట్టణ మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆనంద్ సాయి గౌడ్ అనిల్ బజరంగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు