ఈనెల7న మణుగూరు తాసిల్దార్ కు వినతి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ఎస్సీ కులాల సమస్యలను తాసిల్దార్ కు తెలియజేద్దాం అన్నారు
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా కన్వీనర్ నీలం పార్వతి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల తొలగించిన స్థానిక రిజర్వేషన్ తిరిగి అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున ఎస్సీ రిజర్వేషన్ 20 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 7 న మణుగూరు మండల తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ఎస్సీ కులాల ప్రజలు ఇల్లు లేని వారు, ఇంటి స్థలం లేని వారు, భూమి ఉండి హక్కు పత్రం లేని వారు, వివిధ సమస్యలపై మండల తాసిల్దార్ కు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొంటారని వెల్లడించారు. ఎస్సీ కులాల పెద్దలు పార్టీలకు, సంఘాలకు అతీతంగా కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

Join WhatsApp

Join Now