Site icon PRASHNA AYUDHAM

పొంగులేటి కి వినతి పత్రం 

IMG 20240820 WA2741

ములకలపల్లి టు తాళ్లపాయి కు సైడ్ డైవర్షన్ రహదారి నిర్మించాలని మంత్రి పొంగులేటికి వినతి..

 

– మట్టి దారి కల్పించడానికి నెల రోజులు పడుతుందన్న ఎమ్మెల్యే జారే..

 

– మట్టి పోయడానికే నెల రోజులు పడితే, బ్రిడ్జి కట్టడానికి 10 సంవత్సరాలు పడుతుందా.? అని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు..

– ఎమ్మెల్యే జారే అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశిస్తే ఒక్క రోజే సైడ్ డైవర్షన్ రహదారి నిర్మాణం పూర్తి..

 

ములకలపల్లి టు తాళ్లపాయకు సైడ్ డైవర్షన్ రహదారి నిర్మాణం కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మంగళవారం తాళ్ల పాయి పంచాయతీ ప్రజలు గడ్డం ఉదయ్, వగ్గల వీరస్వామి, కీసరి కృష్ణ, కొండ్రు అనిల్ వినతి పత్రం అందజేశారు. ములకలపల్లి నుంచి తాళ్ల పాయి పంచాయతీకి వెళ్లే సైడ్ డైవర్షన్ రహదారి ఇటీవల వరదలకు కోతకు గురైంది.. దీంతో ఏడు గ్రామాల ప్రజలకు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.. తాత్కాలికంగా నిర్మించిన ఐరన్ వంతెన పూర్తిగా కుంగిపోయి ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా మారింది.. ఐరన్ వంతెన సరి చేసినప్పటికీ రైతులు విద్యార్థులు, ప్రజలు మండల కేంద్రానికి అత్యవసర పరిస్థితిలో రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించి.. ఈ మట్టి రహదారి కల్పించడానికి నెలరోజులు పడుతుందని తెలపడంతో ప్రజలు నివ్వెర పోయారు. తూరాలపై మట్టి పోయడానికె నెల రోజులు పడితే, బ్రిడ్జి నిర్మించడానికి పది సంవత్సరాలు పడుతుందా.? అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించి తూరాలు సరిచేసి ఒక్కరోజులోనే మట్టి పోయిస్తే అయిపోయే పనిని ఎమ్మెల్యే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు..

Exit mobile version