ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా కి,ఎన్ హెచ్ ఆర్ సి, కమిటీ మద్దతు..
జిల్లా లో హైడ్రా కొనసాగాలని కలెక్టర్ కి వినతిపత్రం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కార్యక్రమం అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకొని కొనసాగాలని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాలో కూడా కొనసాగించాలని కామారెడ్డి జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ హైడ్రాకు మద్దతు తెలుపుతూ మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం కమిటీ సభ్యులు అందజేశారు ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కార్యక్రమం హైదరాబాద్ తో పాటు జిల్లా లో కూడా నిర్వహించాలని అక్రమ కట్టడాల కూల్చివేత పై జాతీయ మానవ హక్కుల జిల్లా కమిటీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గతంలో జిల్లాలో అక్రమ కబ్జాలు అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయని వాటిపైన కూడా జిల్లాలో హైడ్రా కార్యక్రమం నిర్వహించి అక్రమాలను కట్టడాల పై చర్యలు తీసుకోవాలని పేద ప్రజలకు మేలు చేసే విధంగా చేయాలని కోరారు యధావిధిగా ప్రతి జిల్లాలో కూడా హైడ్రా కార్యక్రమం నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు మైపాల్, జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ రావు, నర్సింలు, జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి, బిక్నూర్ మండల అధ్యక్షులు రవీందర్, శ్రీకాంత్,సందీప్, భరత్, రాజా గౌడ్, సాయికుమార్, బాల నర్సు, తదితరులు పాల్గొన్నారు.