మున్సిపల్ గత మూడు సంవత్సరాలుగా చెల్లించాల్సిన పి.ఎఫ్ డబ్బులను వెంటనే అకౌంట్లో జమ చేయాలి.
మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు
కాముని గోపాలస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్.
సిద్దిపేట ఆగస్టు 12 ప్రశ్న ఆయుధం :
సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కి గత మూడు సంవత్సరాలుగా చెల్లించాల్సిన పీఎఫ్ డబ్బులు చెల్లించకపోవడం సరైనది కాదని మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కాముని గోపాలస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ అన్నారు. సోమవారం రోజున సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయం ముందు మెరుపు సమ్మె కార్మికులు నిర్వహించారు ఈ సందర్భంగా గోపాల స్వామి, రవికుమార్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి దాదాపు మూడు కోట్ల రూపాయల పి ఎఫ్ డబ్బులు కార్మికుల యొక్క అకౌంట్లో వేయకపోవడం సరైనది కాదని వెంటనే పీఎఫ్ డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో బాధ్యులైనటువంటి వారిని సస్పెండ్ చేయాలని వారన్నారు. మున్సిపాలిటీ డబ్బులు కట్ చేసి కార్మికుల అకౌంట్లో వెయ్యకపోవడం ముమ్మాటికి అవినీతి ప్రక్రియ అని వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకొని విధుల నుండి తప్పించాలని వారు అన్నారు. పిఎఫ్ డబ్బులు కార్మికుల అకౌంట్లో వేసే అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. ధర్నా వద్దకు మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు లు వచ్చి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు చర్చలకు పిలవడం జరిగిందని చర్చల అనంతరం కార్మికుల పిఎఫ్ డబ్బులు చెల్లిస్తే సమ్మె విరమిస్తామని లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా వారు హెచ్చరించారు. కార్మికులకు 399 రూపాయలతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అలాగే 8 గంటల పని మాత్రమే చేయించాలని ఆదివారం, బుధవారం రోజున ఒక పూట మాత్రమే పని చేయించాలని, కార్మికులకి కనీస సౌకర్యాలైన రెండు చేతుల బట్టలు, పార, చీపిరి, బ్లౌజులు, నూనె, సబ్బు, షూ తదితర వాటిని రెగ్యులర్గా అందించాలని అన్నారు గ్రూపులు లేనటువంటి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి 60వ జీవో ప్రకారం 16,500 ఇవ్వాలని అన్నారు గ్రూప్ లేని వారికి కేవలం 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే చూస్తూ ఊరుకోమని దీనిపైన ఉద్యమం చేస్తామని వారు అన్నారు. ఇవన్నీ సమస్యల పరిష్కారం చేయలేని ఎడల సమ్మె ను కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజు కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గుర్రం నరసింహులు, దెబ్బట రాజయ్య, వినోద, రాజు, నరసింహులు, బాల్ నర్సు, కుమారు, విమల, విజయ, కవిత, నరసవ్వ కార్మికులు పాల్గొన్నారు.