Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీజీ అడ్మిషన్లు ప్రారంభం

IMG 20240826 WA03531

కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీజీ అడ్మిషన్లు ప్రారంభం

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 26, కామారెడ్డి :

అత్యంత ప్రతిష్టాత్మకమైన కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వివిధ పీ.జీ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమైనవి. జాతీయస్థాయి న్యాక్ గుర్తింపులో ‘A’ గ్రేడ్ పొంది, అదేవిధంగా స్వయం ప్రతిపత్తి సాధించి 1960 దశకంలో స్థాపించబడి మినీ విశ్వవిద్యాలయాన్ని తలపించే విధంగా సుమారు 158 ఎకరాల విస్తీర్ణంలో ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు వేర్వేరు బ్లాకులుతో విశాలమైన తరగతి గదులు, ఆవిష్కరణలకు అనువైన ప్రయోగశాలలు, అతిపెద్ద గ్రంథాలయం, అపార అనుభవం, నిష్ణాతులైన విభాగఅధిపతులు పచ్చదనం పరుచుకున్న ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే 11 విభాగాలలో పీ.జీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎం ఏ తెలుగు, ఆంగ్లము, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం అదేవిధంగా ఎం ఎస్సీ భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, ఫారెస్ట్రీ, ఫిషరీస్ లు, ఎం కామ్ వాణిజ్య శాస్త్రం, ఎం ఎస్ డబ్ల్యూ సామాజిక అధ్యయనం లు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైన వినూత్న కోర్సులైన ఫారెస్ట్రీకి బోటనీ లేక ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫిసిరీస్ కి జువాలజీ సబ్జక్ట్స్ చదివిన విద్యార్థులు కూడా అర్హులే అని తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఈనెల 27 -30 తారీకు వరకు ఉంటుందని, కళాశాల మొదటి విడత కేటాయింపు సెప్టెంబర్ 4వ తారీఖు జరుగుతుందని అని, అన్ని వసతులు కలిగిన ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు విద్యార్థులు మొదట ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కోరినారు.

Exit mobile version