Site icon PRASHNA AYUDHAM

జీవితంలో మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చేదే ఫోటోగ్రఫీ: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

IMG 20250819 171240

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ… గతంతో పోల్చితే ఫోటోగ్రఫీలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఫోటోగ్రఫీ కొత్త టెక్నాలజీ, ఫ్యాషన్ ప్రతిబింబం, జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ అన్నారు. ఒక ఫోటో అనేది కేవలం చిత్రం మాత్రమే కాదు, అది సమాజంలోని అనేక కోణాలను మన ముందుంచుతుందని అన్నారు. ఒకే ఫ్రేమ్‌లో భావాలను వ్యక్తపరచగల శక్తి ఫోటోగ్రఫీ కే ఉందని, సమాజంలో జరుగుతున్న సంఘటనలకు ఫోటో ఒక సజీవ సాక్ష్యం, కొత్త టెక్నాలజీ సహకారంతో ఈ కళ మరింత విస్తరించిందని తెలిపారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ జర్నలిజం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని, ఒక ఫోటో మనసులను కదిలించే శక్తిని కలిగి ఉంటుందని అన్నారు. విపత్తుల సమయంలో బాధితుల పరిస్థితిని ప్రతిబింబించే చిత్రాలు ప్రజలలో స్పందన కలిగించి సహాయం అందించేందుకు ప్రేరేపిస్తాయని, ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు, అది సమాజానికి అద్దం అని, ప్రతి జ్ఞాపకాన్ని శాశ్వతం చేసే శక్తి ఫోటోకే ఉందని పేర్కొన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద సమయంలో కార్మికులకు సహాయక చర్యలు అందించడంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యక్షంగా ఒక కార్మికురాలిగా పని చేసి వారికి అండగా నిలిచారని చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భముగా గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ… ఫోటోగ్రఫీ అనేది ఒక విలువైన సామాజిక సాధనం.. ఇది సమాజాన్ని కదిలించే శక్తిని కలిగి ఉందని తెలిపారు. ప్రతీ సంఘటనను చరిత్రలో నిలబెట్టే మహత్తరమైన పాత్ర పోషిస్తుందని, కొత్త టెక్నాలజీ, ఫ్యాషన్ మిళితంగా ఒక ఫోటో జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే శక్తిని కలిగి ఉందని అన్నారు. అంతకు ముందు జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి, అక్కడ ప్రదర్శించిన చిత్రాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, టిజిఓ జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్, టి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరీఫ్, జనరల్ సెక్రటరి సత్యం,వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version