క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలుగుతుంది

క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలుగుతుంది

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

ఎంఈఓ హేమలత పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్

జమ్మికుంట సెప్టెంబర్ 12 ప్రశ్న ఆయుధం

జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న 69వ ఎస్ జి ఎఫ్ పోటీలు మూడు రోజులు ఉత్సాహంగా కొనసాగాయి. శుక్రవారం రోజున ఎస్ జి ఎఫ్ క్లోజింగ్ సెర్మనీ నిర్వహించారు. ఎంఈఓ హేమలత ఆధ్వర్యంలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందించారు పట్టణ సీఐ రామకృష్ణగౌడ్ వారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం , మానసిక ఉల్లాసం, విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. వివిధ పాఠశాల నుండి సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యోదయ సెయింట్ థామస్,లోటస్ పాండ్, జడ్.పి.హెచ్.ఎస్ కోరపల్లి, బాయ్స్ హై స్కూల్ , జడ్.పి.హెచ్.ఎస్ వావిలాల, సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14 విభాగంలో వాలీబాల్ మొదటి స్థానంలో జడ్.పి.హెచ్.ఎస్ కోరపల్లి, రెండో స్థానంలో సెయింట్ థామస్, అండర్ 17 వాలీబాల్ జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ మొదటి స్థానం, రెండవ స్థానంలో సోషల్ వెల్ఫేర్, అండర్ 14, 17 ఖో ఖో లో మొదటి స్థానంలో సోషల్ వెల్ఫేర్, రెండో స్థానంలో జడ్పీహెచ్ఎస్ కోరపల్లి విద్యార్థులు నిలిచారు, అండర్ 14 కబడ్డీ మొదటి స్థానంలో సెయింట్ థామస్, రెండవ స్థానంలో సోషల్ వెల్ఫేర్, అండర్ 17 కబడ్డీ మొదటి స్థానంలో విద్యోదయ, రెండో స్థానంలో జడ్.పి.హెచ్.ఎస్ కొరపల్లి నిలిచాయి గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్టు మండల ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శ్రీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, కోరపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పిడి శ్రీనివాస్, ప్రేమలత, రేణుక, వివిధ పాఠశాల పీటీలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment