ప్రముఖ నటి రాధికకు అస్వస్థత!.. ఆస్పత్రిలో పిక్స్ వైరల్
Aug 01, 2025,
ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 28న ఆమె చెన్నైలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరారు. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా, వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యిందట. అందుకే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా, పూర్తి కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని తెలిసింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్ధిస్తున్నారు.