*జగన్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారు : పేర్నినాని*
జగన్ టార్గెట్‌గా అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏమీలేని కేసుల్లో సిట్ అంటూ ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు.
స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడు 53 రోజులు జైలులో ఉన్నారని, ఒక్క రోజైనా అదనంగా జగన్‌ను జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందరపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అని పేర్ని నాని తెలిపారు.
*ఒకరోజు ఎక్కువ జైల్లో ఉంచాలని…*
జగన్ అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసు నడుపుతున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని లిక్కర్ కేసులో దొంగ సాక్ష్యాలు సేకరిస్తున్నారన్నారు. లిక్కర్ కేసుతో జగన్‌కు ఏం సంబంధం అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. సిట్ అధికారులు అరెస్ట్ లు చేస్తూ వారి చేత తప్పుడు సాక్షాలు చెప్పించాలని చూస్తున్నారంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. అయితే జగన్ అంటే ఏంటో ప్రజలకు తెలుసునని, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో తప్పుదోవ పట్టించడానికే ఈ కేసులను పెడుతున్నారని అన్నారు.