*యాత్రికుల బస్సుకి మంటలు కాలిబుడిదైన సామాగ్రి ఒకరి సజీవ దహనం*
*
*స్థానిక ఎమ్మెల్యే బండి సంజయ్ లతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి ప్రయాణం*
*నిర్మల్ -జనవరి 15:-* మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ముధోల్ నియోజకవర్గం ప్రజలు సాధ్యమైనంత వరకు తీర్థయాత్రల విషయంలో ముందుంటారని చెప్పవచ్చు అలాంటిది 50 మందితో కలిసి వెళుతున్న బస్సు ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ ప్రాంతంలో అగ్ని కీలల మధ్య యాత్రికుల సామాగ్రి డబ్బు నగలు తోపాటు ఒకరి సజీవ దహనం ఘటన అత్యంత బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇదే విషయమై మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు నియోజకవర్గంలోని భైంసా, ముధోల్, కుబీర్ మండలాలకి చెందిన 50 మందితో బయలుదేరిన బస్సు ప్రాంతాలు రాష్ట్రాలు దాటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నప్పటికీ మరికొన్ని గంటల్లో తమ యాత్ర కి నిజమైన అర్థం దొరుకుతుందని భావించిన ఆ యాత్రికులకి మంగళవారం సాయంత్రం మరిచిపోలేని విషాద సంఘటనను మిగిల్చింది. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సైతం అదే బస్సులో తీర్థయాత్రలకోసం బయలుదేరారు. స్థానికంగా బస్సును నిలిపి ఉంచిన తర్వాత అక్కడే ఉన్న కొన్ని ఆలయాల దర్శనాల కోసం యాత్రికులంతా వెళ్లిన సమయంలో 63 సంవత్సరాలు గల వ్యక్తి బస్సులోనే అనారోగ్య సమస్యల కారణంగా దేవదర్శనానికై వెళ్లలేదు. అదే సమయంలో బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే అగ్నికీలల్లో పూర్తిగా ఖాళీ బూడిదయింది అందులోనే ఆ వ్యక్తి ఉండడం వల్ల సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త మిగిలిన యాత్రికుల ద్వారా వారి బంధువులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో బుధవారం తమ వారంతా ఎలా ఉన్నారో వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయో అనే అయోమయంలో అప్పుడే ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రామారావు పాటిల్ ఆయనతోపాటు బండి సంజయ్ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యాత్రికులను సురక్షితంగా తమ సొంత గ్రామాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి మందులు ఒక్కొక్కరికి 1000 నుండి 2000 రూపాయల వరకు అందించి దారి పొడవునా ఆకలి వేసినప్పుడు తినేందుకు ఆహార పొట్లాలను అందించడంతోపాటు అన్ని విధాల అక్కడ ఉన్న ఆ జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారని తెలిసింది. బుధవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ కి చెందిన కలెక్టర్ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో ఫోన్లో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలిపినట్లు పోలీసులు సైతం తెలిపారు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం తరపున జిల్లా ఎస్పీ జానకి షర్మిల సైతం కోరారు దీంతో బుధవారం ఉదయం తిరిగి మిగిలిన యాత్రికలంతా స్వస్థలానికి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన వాహనాల్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన స్థానిక ఎమ్మెల్యే రామారావు పాటిల్ తో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి అధికారులకు రుణపడి ఉంటామని యాత్రికులు తెలిపినట్లు సమాచారం.