ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 24 భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి
నూతనంగా నిర్మించిన ద్వారకా వీధిని ప్రారంభించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకి పూల గుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికిన ద్వారకా వీధి ప్రజలు. మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయితీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ద్వారకా వీధి లో నూతనంగా నిర్మించిన ద్వారక వీధి ఆర్చ్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ద్వారక వీధి ఆర్చ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాయం అనంతరం ద్వారక వీధి గ్రామస్తులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తేగా అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం ఎమ్మెల్యే పాయం కి ద్వారక వీధి గ్రామ ప్రజలు శాలువాతో సత్కరించారు వీధి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన పాయం
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గుడిపూడి కోటేశ్వరరావు ఎం.లోకేష్ సత్తన్న రాజు , ఎం .భాస్కర్ రావు నాగేశ్వరావు వెంకటేశ్వర్లు కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా నిర్మించిన ద్వారక వీధి ఆర్చ్ ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
