Site icon PRASHNA AYUDHAM

కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్

IMG 20250621 WA2467

*కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్*

జమ్మికుంట జూన్ 21 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగళి రమేష్ అన్నారు. శనివారం రోజున కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ ప్రకటన విడుదల చేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఓటు వేసి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడని అలాంటి వ్యక్తిపై రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన కౌశిక్ రెడ్డి నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం చూసి ఇది నచ్చని అధికార పార్టీ కౌశిక్ రెడ్డి పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఇలాంటి కేసులకు కౌశిక్ రెడ్డి భయపడడని కౌశిక్ రెడ్డి ఒక్కడు కాదని ఆయన వెంట హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలతోపాటు నాయకులు పార్టీ అధిష్టానం ఆయన వెంట ఉందన్నారు. బేషరతుగా ఆయన పై పెట్టిన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో మరో ఉద్యమం తప్పదని పేర్కొన్నారు

Exit mobile version